బంగారం, వెండి రేట్ల గురించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద గందరగోళం కొనసాగుతోంది. వాస్తవ పరిణామాలకు మించి ఇంత భారీగా లోహాల రేట్లు పెరగటం చూస్తుంటే త్వరలోనే పెద్ద బబుల్ బర్ట్స్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక్క నెలలోనే వీటి ధరలు అమాంతం పెరగటంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేట్ల విషయం పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఫోమోలో విపరీతంగా షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మారిన రిటైల్ ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జనవరి 29న బంగారం రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.1177 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.17వేల 885గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.16వేల 395గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి కూడా తగ్గేదేలే అంటూ రోజురోజుకూ కొత్త ఊహించని స్థాయిలకు పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. గురువారం జనవరి 29, 2025న వెండి రేటు కేజీకి రూ.25వేలు పెరిగింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.4లక్షల 25వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.425 వద్ద ఉంది.
