తొర్రూరు, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలిచి, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరులో ప్రచారం నిర్వహించారు. 14వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే దోశలు వేస్తూ, వ్యాపారస్తులు, హోటల్ యజమానులు, కార్మికులను పలుకరిస్తూ ఓటు వేయాలని కోరారు.
మున్సిపాలిటీలో 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కాగా, 13వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాటోతు భద్రు నాయక్, జాటోతు దాసు, జాటోతు భిక్షు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
