Sanju Samson: మేము ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్: అభిషేక్తో పాట్నర్షిప్పై సంజూ శాంసన్

Sanju Samson: మేము ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్: అభిషేక్తో పాట్నర్షిప్పై సంజూ శాంసన్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓపెనింగ్ జోడి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బ్యాంటింగ్ పర్ఫామెన్స్ మళ్లీ వరల్డ్ కప్ వరకు గుర్తుండిపోతుంది. బౌండరీల సునామీ సృష్టించారు ఇద్దరు. ఇదేం చితక్కొట్టుడు సామీ.. అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఆ మ్యాచ్ లో ఇద్దరి పాట్నర్ షిప్ గురించి సంజూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మాది ఐస్ అండ్ ఫైర్ పాట్నర్షిప్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్ అంటూ చమత్కరించాడు. 

ఇండియా టుడే 2026 కాంక్లేవ్ లో పాల్గొన్న సంజూ.. ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ తో కెమిస్ట్రీ గురించి చెప్పాడు. మేము ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్.. ఒక్కో సారి అతడు ఫైర్ అయితే మరోసారి నేను ఫైర్ అవుతుంటా. అలాంటి కాంబినేషన్ అది. మేము 2024 నుంచి ఈ ఫార్ములా పాటిస్తూనే ఉన్నాం. దీనికి తోడు  కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. కాంప్లికేట్ చేయదలచుకోలేదు అని చెప్పాడు. 

ఫైనల్ లో ఇద్దరూ కలిసి 98 రన్స్ ల ఓపెనింగ్ పాట్నర్షిప్ ఇచ్చారు. పవర్ ప్లేలో అద్భుతమైన స్టార్ట్ రావడంతో స్కోర్ 255 వరకు వెళ్లింది.  బాల్ ఎలా వస్తుంది అని అభిషేక్ అడుగుతాడు.. నార్మల్ గా వస్తుంది.. సిక్స్ కొట్టమని చెప్తుంటా. అభిషేక్ చాలా డేరింగ్ బ్యాట్స్ మన్. అతని క్యారెక్టర్ అంటే ఇష్టపడతా. ఫీల్డ్ లో కానీ, బయట కానీ అతని పాట్నర్షిప్ ఇష్టపడుతాను అని సంజూ పేర్కొన్నాడు. 

కంబాక్ స్టోరీ:

శాంసన్, అభిషేక్ ఇద్దరిదీ టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుతమైన కంబాక్ స్టోరీనే. టౌర్నమెంట్ కు ముందు శాంసన్ ను తప్పించారు. ప్లేయింగ్ 11 లో లేకుండా బెంచ్ కే పరిమితమయ్యే పరిస్థితి. మరోవైపు అభిషేక్ అనారోగ్యం కారణంగా కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్నాడు. 

►ALSO READ | ప్రపంచ్ కప్ అయినా కూడా ఇలా తొండి చేయొద్దు: రనౌట్ వివాదంపై కైఫ్ సంచలన కామెంట్స్

చివరి నాలుగు మ్యాచులలో శాంసన్ కు అవకాశం వస్తే.. అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఇండియాకు కప్ తెచ్చిపెట్టాడు. ఇక అభిషేక్ మొదటి నుంచీ ఫ్లాప్ అవుతూ విమర్శలపాలయ్యాడు. ఫైనల్ మ్యాచ్ లో ఇంక్రెడిబుల్ ఇన్నింగ్స్ ఆడి విమర్శలకు సమాధానం చెప్పాడు.