హైదరాబాద్/భువనగిరి: నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ట్రిపుల్ ఆర్ ను అనుసరిస్తూ.. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర సిద్ధమైంది. ఈ మేరకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం అవసరమైన సర్వే నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేసింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్ సభ రూల్ 377 కింద లేవ నెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ రీజినల్ రింగ్ రోడ్ వెంట రైల్వే లైన్ అలైన్ మెంట్ ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. డీపీఆర్ సిద్ధమైన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి తదుపరి చర్యలు చేపడతారు. అనంతరం నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టుకు తుది అనుమతులు లభిస్తాయి. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా పెద్ద ఊతం లభించనుందని అధికారులు భావిస్తున్నారు.
►ALSO READ | హైదరాబాద్ లో కేటుగాళ్లు.. లాంగ్ డ్రైవ్ పేరుతో కారును అద్దెకు తీసుకుని.. రెండున్నర లక్షలకు అమ్మేశారు
