హైదరాబాద్ లో కేటుగాళ్లు.. లాంగ్ డ్రైవ్ పేరుతో కారును అద్దెకు తీసుకుని.. రెండున్నర లక్షలకు అమ్మేశారు

హైదరాబాద్ లో  కేటుగాళ్లు.. లాంగ్ డ్రైవ్ పేరుతో కారును అద్దెకు తీసుకుని.. రెండున్నర లక్షలకు అమ్మేశారు

మెట్రోనగరాల్లో కొన్ని సంస్థలు కార్లు అద్దెకు ఇస్తున్నాయి . అయితే ఇదే అదునుగా తీసుకున్న  కొందరు కేటుగాళ్లు లాంగ్ డ్రైవ్ పేరుతో కారును అద్దెకు తీసుకుని ఏం చక్కగా అమ్మేశారు.  చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కారును లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకొని రాజస్థాన్ లో అమ్మిన వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

ఉస్మానియా యూనివర్సిటీ ఏసిపి జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట నివాసి రామలింగేశ్వర్ అనే వ్యక్తి కారును ఫిబ్రవరి 25వ తేదీన దొంగలు లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. మూడు నాలుగు రోజులు కారు కోసం ఎదురుచూసినా రాలేదు. దీంతో ఆ కారు యజమాని చివరకు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  ఆ దొంగలు కారులో ఉన్న జిపిఎస్ సిస్టం, నెంబర్ ప్లేట్లు తీసివేశారని తెలిపారు. ఆ దొంగలు హైదరాబాద్ లో దొంగిలించిన కారును రాజస్థాన్లో స్క్రాప్ లో ఉన్న మరో పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు  ఫాస్టాగ్  తీసి లాంగ్ డ్రైవ్ కి తీసుకు వెళ్లిన కారుకు అమర్చారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన కారును రాజస్థాన్ లో  రెండున్నర లక్షలకు అమ్మేశారు. 

►ALSO READ | హైదరాబాద్ పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు..బావిలో కుళ్లిపోయి ఇలా..అసలేం జరిగింది.?

కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన  నల్లకుంట పోలీసులు చంద్రాయణ్ గుట్ట,  ఫలక్ నుమా, బాబా నగర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి  మహీంద్రా ఎక్స్యువి కారు, 5 సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు.పరారీలో ఉన్న  మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.