ప్రధాని మోడీపై మార్ఫింగ్ ఫోటోలతో అభ్యంతరకర పోస్టులు... మెటా ఇండియా హెడ్ పై కేసు..

ప్రధాని మోడీపై మార్ఫింగ్ ఫోటోలతో అభ్యంతరకర పోస్టులు... మెటా ఇండియా హెడ్ పై కేసు..

ప్రధాని మోడీ మార్ఫింగ్ ఫోటోలతో అభ్యంతరకర పోస్టులు వైరల్ అవ్వడంతో మెటా సంస్థ ఇండియా హెడ్ పై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది. ఇటీవల మోడీ మార్ఫింగ్ ఫోటోలతో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ( జులై 31 ) మెటా సంస్థ ఇండియా హెడ్ తో పాటు పలువురిపై కేసు నమోదయ్యింది. బీజేపీ సోషల్ మీడియా ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.

ప్రధాని నరేంద్ర మోడీ పై అభ్యంతరకర మార్ఫింగ్ ఫోటోలతో రీల్స్ ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు బీజేపీ సోషల్ మీడియా ప్రతినిధి. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఆపరేటర్లు, మెటా ఇండియా హెడ్ లపై కేసు నమోదు చేశారు హైదరాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులు.

►ALSO READ | మహారాష్ట్రలో ఘోరం.. పురాతన భవనానికి రిపేర్ చేస్తుండగా కూలి ఆరుగురు మృతి

మెటా సంస్థ ఇండియా హెడ్ తో పాటు పోస్టులు చేసినవారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.IT యాక్ట్ సెక్షన్ 66(C), 67తో పాటు BNS: సెక్షన్ 353(2), 336(4) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు.