కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..12 ఏళ్లలో సాధించిన విజయాలపై వర్క్‌‌ షాప్

కేంద్ర పథకాలను  ప్రజల్లోకి తీసుకెళ్లాలి..12 ఏళ్లలో  సాధించిన విజయాలపై వర్క్‌‌ షాప్
  •    పీఐబీ ఏడీజీ శ్రుతిపాటిల్​

పద్మారావునగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ అన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై గురువారం కవాడిగూడలోని సీజీవో టవర్స్‌‌లో పీఐబీ ఆధ్వర్యంలో 'వార్త' వర్క్‌‌షాప్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు హాజరై తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో మీడియా ద్వారా ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసే చర్యలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరడమే లక్ష్యమని, ప్రచార సహకారానికి పీఐబీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రుతి పాటిల్ తెలిపారు.