హసన్ పర్తి, వెలుగు: విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్వా అన్నారు. హనుమకొండ జిల్లా భీమారంలోని ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్లో టేక్ స్ప్రింగ్ ఫెస్ట్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్వా, ఎస్బీ టెట్ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్ చైర్మన్ ఎర్రబెల్లి తిరుమాల్ రావు హాజరై ఫెస్ట్ ప్రారంభించారు.
అనంతరం శ్రీకాంత్ సిన్వా మాట్లాడుతూ సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతున్న కాలంలో విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ ఎర్రబెల్లి సువర్ణ, సంస్థ కార్యదర్శి అనూఫ్, డాక్టర్ హర్షిని పాల్గొన్నారు.
