హైదరాబాద్, వెలుగు: బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో 89 శాతం పెరిగి రూ.712.28 కోట్లుగా నమోదైంది. నికర లాభం 119 శాతం వృద్ధితో రూ.54.20 కోట్లకు చేరింది.
మొదటి తొమ్మిది నెలల్లో ఆదాయం 125 శాతం పెరిగి రూ.1,928.95 కోట్లుగా నిలిచింది. నికర లాభం 140 శాతం పెరిగి రూ.148.30 కోట్లుగా నమోదైంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో విస్తరణ ప్రాజెక్టుల నిర్వహణ వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు తెలిపారు.
