వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు మార్కెట్లలోవనపర్తి వేరుశనగకు రికార్దు ధర పలికింది. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి మార్కెట్, వనపర్తి మార్కెట్లలోవ్యాపారులు పోటాపోటీగా ధర పెట్టి కొనుగోలు చేశారు. బుధవారం వనపర్తిలో క్వింటాల్‌కు రూ.12,667 ధర పలకగా, బాదేపల్లిలో రూ.12,039 ధర పలికింది. వనపర్తికి 170 టన్నుల వేరుశనగ వచ్చింది.
గద్వాల మార్కెట్ లో రూ.11,590 ధర పలకగా, 23 టన్నుల పంట వచ్చింది. అచ్చంపేటలో రూ.12,552 ధర పలకగా 41 టన్నులు, మహబూబ్‌నగర్‌లో రూ.12,479 ధర పలకగా 400 టన్నులు, నాగర్‌కర్నూల్‌లో రూ.12,219 ధర పలకగా, 3.63 టన్నులు, నారాయణపేటలో రూ.10,791 ధర పలకగా 37.44 టన్నుల వేరుశనగ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
