హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక చెన్నైలో బైక్ పూలింగ్ చేస్తూ ఇబ్బందులు పడే యువకుడిగా సంతోష్ శోభన్ కనిపించాడు. టీజర్లో రొమాన్స్, కిస్ సీన్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'గాబరా గాబరా' సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తోంది.
ఇవాళ (జనవరి 28న) సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ‘గాబరా గాబరా’ రిలీజ్ అయింది. క్షణాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు, మ్యూజిక్ సూపర్ ఫ్రెష్‌గా, నేటి జనరేషన్ లైఫ్‌స్టైల్‌కు అద్దం పడేలా ఉంది. సాంగ్ ద్వారా, లైఫ్ లో గందరగోళంగా ఉన్నప్పుడు ఒక యువకుడు ఎలా ఫీల్ అవుతాడో స్పష్టంగా చూపించారు.
రాకేందు మౌళి అందించిన సాహిత్యం ప్రత్యేకంగా వెరైటీగా ఉంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు, కన్ఫ్యూజన్స్ ను సరదాగా లిరిక్స్‌లో చూపించారు. "గాబరా గాబరా సోదరా, లైఫ్ మొత్తం.. కాలమే తన్నెరా నీ లక్కుని.. బంతి భోజనంలో బంతిని వడ్డిస్తారా"
ఈ లైన్స్ ఫన్నీగా ఉండటం వల్ల పాట మరింత ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణన్ వాయిస్‌లోని ఈ కిక్ సాంగ్ పదే పదే వినిపించేట్లా ఉంది. మ్యూజిక్ కూడా రొటీన్‌కి భిన్నంగా, కొత్తగా అనిపిస్తోంది.
