హైదరాబాద్, వెలుగు: ఆక్మే ఫిన్ ట్రేడ్ ఇండియా లిమిటెడ్ యాక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు బీమా ఉత్పత్తులను విక్రయించనుంది. తద్వారా వడ్డీయేతర ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మూల ధనాన్ని బలోపేతం చేసేందుకు ఎన్సీడీల ద్వారా నిధుల సమీకరణ కూడా చేపట్టింది. డిసెంబర్ 2025 జనవరి 2026 నెలల్లో 11.50 శాతం వడ్డీ రేటుతో రూ.50 కోట్లు సేకరించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా మొత్తం రూ.180 కోట్లు సేకరించింది.
