ఇలాగే పెరుగుతూపోతే.. కిలో వెండి 10 లక్షలు ఖాయం.. 30 రోజుల్లోనే లక్షన్నర పెరిగిన కేజీ సిల్వర్

ఇలాగే పెరుగుతూపోతే.. కిలో వెండి 10 లక్షలు ఖాయం.. 30 రోజుల్లోనే లక్షన్నర పెరిగిన కేజీ సిల్వర్

Silver Rates: వెండి ధరలు పెరుగుతున్న తీరు.. మైండ్ బ్లాంక్ చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి రోజూ ఆల్ టైం హై ధరలను టచ్ చేస్తూ.. దూసుకుపోతున్న వెండి ధర పెరుగుదల ఎంత వరకు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. రాబోయే రోజుల్లో కిలో వెండి 10 లక్షల రూపాయలకు చేరుతుందా అనే డౌట్స్ జనంలో విపరీతంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. 

2026 కొత్త ఏడాది.. జనవరి నెల. ఇప్పటి 29 రోజులు మాత్రమే అయ్యింది. ఈ 29 రోజుల్లో కిలో వెండి అక్షరాల లక్షన్నర రూపాయలు పెరిగింది. 28 నుంచి 29వ తేదీ వరకు.. ఒకే ఒక్క రోజు.. 24 గంటలు మాత్రమే. ఈ 24 గంటల్లో కిలో వెండి 40 వేల రూపాయలు పెరగటం చూసి మార్కెట్ వర్గాలే అవాక్కవుతున్నాయి. 2026, జనవరి 29వ తేదీన రిటైల్ మార్కెట్ లో కిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయలకు చేరింది. ఇదే వెండి.. 2026, జనవరి ఒకటే తేదీన 2 లక్షల 50 వేల రూపాయల దగ్గర ఉంది. అంటే 29 రోజుల్లో కిలో వెండి పెరిగిన ధర అక్షరాల లక్షన్నర రూపాయలు. ఇదే తీరుగా.. ఇదే తరహాలో.. ఇదే విధంగా వెండి ధర పెరుగుతూ పోతే.. 2026 డిసెంబర్ నాటికి అటూ ఇటూగా.. 10 లక్షల రూపాయలు అయినా ఆశ్చర్యం లేదనే మాటలు జనంలో వినిపిస్తున్నాయి. వ్యాపారులు ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం.. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాలు.. రూపాయి విలువ బలహీనంగా ఉండటం.. పారిశ్రామిక అవసరాలకు వెండి వినియోగం భారీగా పెరగటం.. స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుగులు ఉండటంతో.. పెట్టుబడిదారులు అందరూ సేఫ్టీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ వైపు మొగ్గు చూపటంతోనే వెండి ధరలు ఈ రేంజ్ లో పెరుగుతున్నాయనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.

వెండి రేట్లు తగ్గుతాయ్ అనే కోరికలు, ఆశలు ఇకపై కుదరదని తాజా ర్యాలీ చెబుతోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వెండి విపరీతమైన పెరుగుదలను చూసింది. పారిశ్రామిక డిమాండ్ స్థిరంగా రేట్లను పెంచుతుందనుకుంటే చాలా పొరపాటని నిపుణులు అంటున్నారు. ఇండస్ట్రీ నుంచి డిమాండ్ కొంత తగ్గినప్పటికీ రిటైలర్లు, ఇన్వెస్టర్ల నుంచి అలాగే ఈటీఎఫ్ పెట్టుబడుల ప్రవాహంతో సిల్వర్ భారీ ర్యాలీకి గురవుతోందని తేలింది. 

వెండి భారీగా పెరగటానికి పెట్టుబడులు ఒక్కటే కాకుండా రిటైల్ కొనుగోలుదారుల నుంచి భౌతిక వెండి ఆభరణాలు, బిస్కెట్లు, కాయిన్స్, వస్తువుల కొనుగోలు కూడా మరో కారణంగా తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ దిగుమతి సుంకాలు పెరుగుతాయనే భయాలతో ముందుగానే చాలా మంది కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఊహించని అధిక డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు కూడా దిగుమతి రేటు కంటే కేజీకి రూ.30వేల నుంచి రూ.40వేల వరకూ ప్రీమియంకు అమ్ముతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 29, 2025న కేజీకి వెండి ధర రూ.25వేలు భారీ పెరుగదలను నమోదు చేసింది జనవరి 28, 2026తో పోల్చితే. అంటే జస్ట్ ఒక్క రాత్రిలోనే వెండి ధరలు అమాంతం పెరగటంతో పెట్టుబడులు పెట్టిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆభరణాలు, వస్తువులు షాపింగ్ చేయాలని అనుకుంటున్న వ్యక్తులు మాత్రం షాక్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.4లక్షల 25వేలుగా కొనసాగుతోంది. అయితే ఈ రేటు ఇంకా భవిష్యత్తులో పెరిగి నిపుణులు అంచనా వేస్తున్నట్లు ఈ ఏడాది చివరి నాటికి కేజీ రూ.10 లక్షలకు చేరుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వెండి సరఫరా తగ్గటం, ప్రత్యేకంగా సిల్వర్ మైన్స్ లేకపోవటం వల్ల భవిష్యత్తు అవసరాలకు సరిపడా వెండి లేదని అందుకే ఈ రేట్ల దూకుడు కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.