ఖాతాదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : అడ్లూర్ ఎల్లారెడ్డి మేనేజర్ తుమ్మ సంపత్ కుమార్

ఖాతాదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి  : అడ్లూర్ ఎల్లారెడ్డి మేనేజర్ తుమ్మ సంపత్ కుమార్
  •  టీజీబీ అడ్లూర్​ ఎల్లారెడ్డి మేనేజర్​ తుమ్మ సంపత్​ కుమార్​ 

సదాశివనగర్​, వెలుగు: తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ ఖాతా దారులు బ్యాంక్​ ద్వానా ప్రభుత్వం అందిస్తున్న   పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడ్లూర్​ ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ మేనేజర్​ తుమ్మ సంపత్​ కుమార్​ అన్నారు. బుధవారం బ్యాంక్​ పరిధిలోని కుప్రియల్​ గ్రామ పంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన ఖాతా దారుల సమావేశంలో మాట్లాడారు.. పేద ప్రజలు, రైతులు, నిరుద్యోగుల కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒకరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఖాతా దారులకు బ్యాంక్​ ద్వారా విద్యా, బంగారం, వ్యవసాయ, చిన్న పరిశ్రమలు, సామాజిక భధ్రత పథకాలు, అటల్​ పెన్షన్​, నగదు రహిత లావా దేవీలు, సైబర్​ మోసాలపై జాగ్రత్తల పై వివరించారు. ఈ సందర్భంగా కళాజాత   ఆట పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఫీల్డ్​ ఆఫీసర్​ రాజగోపాల్​, శ్రీకాంత్​, ​సర్పంచ్​ జంగంగారి రాజమణి, ఉప సర్పంచ్​ గున్నాల అన్వేశ్​ గౌడ్​,​ బ్యాంక్​ మిత్ర కాటిపల్లి భూపాల్​ రెడ్డి, గ్రామ సంఘాల వీవోఏలు, డ్యాక్రా సంఘాల సీఏలు,  ప్రతినిధులు, ఆశ వర్కర్లు, ఖాతాదారులు, గ్రామస్తులు   పాల్గొన్నారు.