SA vs NZ: న్యూజిలాండ్పై అదరగొట్టిన సౌతాఫ్రికా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం 

SA vs NZ: న్యూజిలాండ్పై అదరగొట్టిన సౌతాఫ్రికా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం 

SA vs NZ: న్యూజిలాండ్ టూర్ ని సౌతాఫ్రికా ఘనంగా ప్రారంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ పై ఏకంగా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో ఐదు మ్యాచుల సిరీస్ లో ప్రోటీస్ 1–-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, కగిసో రబాడ, లుండి ఎంగిడి లాంటి సీనియర్లు లేనిప్పటికి.. కేశవ్ మహారాజ్ కెప్టెన్సీలో సఫారీ యంగ్ టీమ్ అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ప్రోటీస్ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. 

న్యూజిలాండ్  బ్యాటర్లలో నీషమ్(26) ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలం అయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా 3 వికెట్లు తీసుకోగా, కోయిట్జ్, బార్ట్మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం 92 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన సౌతాఫ్రికా కూడా తీవ్రంగా కష్టపడింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు.

►ALSO READ | MS Dhoni: మెంటర్+ ప్లేయర్గా ధోనీ.. సంజూ వచ్చినా కెప్టెన్గా గైక్వాడ్నే కొనసాగించాలి..

ఇక సౌతాఫ్రికా ఓపెనర్ కానర్ ఎస్టరైజెన్(45) అజేయంగా నిలిచి మ్యాచ్ ని కంప్లీంట్ చేశాడు. ఫలితంగా ప్రోటీస్ లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ని చేధించింది. దీంతో రెండు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా మార్చి 17వ తేదీన జరగనుంది.