బోధన్ పట్టణంలో హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

బోధన్ పట్టణంలో హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

బోధన్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్ పట్టణంలో ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆచన్ పల్లిలోని దీపక్ స్వీట్ హోంలో తనిఖీ చేయగా15 సిలిండర్లు, చాందిని దాబాపై దాడి చేయగా 3 సిలిండర్లు దొరికాయి. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్​సిలిండర్లు వినియోగించడంతో హోటల్ ఓనర్లపై కేసు నమోదు చేసి సిలిండర్లను సీజ్ చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు హన్మంతు, పవన్ తెలిపారు. 

నిర్మల్ పట్టణంలో..

 నిర్మల్: నిర్మల్ పట్టణంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. శుక్రవారం 16 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా గృహావసరాలకు కేటాయించిన 29 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.