ఉగాది స్పెషల్ 2026: కొత్త సంవత్సరం.. పరాభవ నామ సంవత్సరం..విశేషాలు.. సందేశం ఇదే..!

ఉగాది స్పెషల్ 2026: కొత్త సంవత్సరం.. పరాభవ నామ సంవత్సరం..విశేషాలు.. సందేశం ఇదే..!

ఉగాది  పండుగ తెలుగు వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపే పండగు.  సంస్కృతి.. సంప్రదాయాలకు.. ధర్మబద్ద జీవన విధానాన్ని ప్రారంభించిన రోజు.  2026  మార్చి 19న పరాభవనామ సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు అందరూ రడీ అయ్యారు.  ఇలాంటి ముఖ్యమైన రోజున మన జీవితాలను ఆధ్యాత్మిక పరంగా.. సేవా పరంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని పండితులు చెబుతున్నారు. 

తెలుగువారి కొత్త సంవత్సరం  పరాభవ నామ సంవత్సర విశేషాలు

 పండుగ తేది  : 2026 మార్చి 19.. ఆ రోజు  ఈ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి తిథి  ఉదయం 6.53 గంగలకు ప్రారంభమవుతుంది.  పాడ్యమి తిథి మార్చి 20  ఉదయం 04:54 గంటలకు ముగుస్తుంది.  కావున పండితులు తెలిసిన వివరాల ప్రకారం ఉదయం సమయంలో పాడ్యమి తిథి ప్రాబల్యం ఉండటం వల్ల మార్చి 19నే ఉగాది పర్వదినంగా భావిస్తారు.

ఉగాది పూజా విధానం

ఉగాది రోజున ప్రాత: కాలంలో కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  తరువాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి.. గడపలను పసుపు.. కుంకుమతో అలంకరించాలి.  పూజా మందిరంలో కలశాన్ని ( కుటుంబ ఆచారం ప్రకారం) ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబంలో కలశాన్ని ఏర్పాటు చేసుకొనే ఆచారం లేకపోతే అవసరం లేదు.  కుల దైవాన్ని ఆవాహన చేసుకోవాలి. ముందుగా  కొత్త సంవత్సరానికి సంబంధించిన సంకల్పాన్ని చెప్పుకొని.. గణపతి పూజ చేసుకొని.. విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని.. పరమేశ్వరునికి పూజలు చేయాలి.  షోడసోపచార పూజలు చేసి.. ధూపం.. దీపం.. హారతి తరువాత ఉగాది పచ్చడిని స్వామివారికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి.   ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవన తత్వాన్ని గుర్తుచేసుకుంటారు.తరువాత మహానివేద్యం సమర్పించాలి.  ఈ విధంగా చేయడం ఎంతో కాలంగా వస్తున్న ఆచారం.. 

►ALSO READ | ఉగాది 2026 : తెలుగు వారి తొలి ప్రకృతి పండుగ ఉగాది.. పురాణాల్లోని విశిష్ఠత అందరూ తెలుసుకోవాలి..!

పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత

ఇంట్లో పూజ అనంతరం... దగ్గరలోని దేవాలయానికి వెళ్లాలి.  ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినాలి.  ఇది ఒక ప్రాచీన ఆచారమని పండితులు చెబుతున్నారు.  పంచాంగం అనేది తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వంటి 5 ముఖ్య అంశాలను వివరిస్తుంది. కొత్త  సంవత్సరంలో జరిగే ఖగోళ మార్పులు .. వాటి ప్రభావాలను తెలియజేస్తాయి. పంచాంగ శ్రవణం ద్వారా ఆ సంవత్సరంలో వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు, సామాజిక శాంతి వంటి అంశాలపై సంక్షిప్త అవగాహన లభిస్తుంది. తరువాత బ్రాహ్మణులకు వస్త్రదానం .. దక్షిణ తాంబూలం ఇచ్చి.. వారి ఆశీర్వాదాలను తీసుకోవాలి. 
 
కొత్త సంవత్సరం.. పరాభవ నామ సంవత్సరం..

తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి.  ఇవే పునరావృతమవుతుంటాయి. ఈ ఏడాది 2026 లో మార్చి 19న కొత్త తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం ప్రారంభమవతుంది.  పరాభవం అంటే లోపాలను అధిగమించి  ఉన్నత స్థితిని చేరుకొనే సమయాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికత.. వినయం.. ఆత్మపరిశీలన.. సేవాగుణాన్ని  వృద్ది చేసే సందేశాన్ని ఇస్తుంది. 
 

 పరాభవ నామ సంవత్సరం విశేషాలు

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో  వ్యక్తిగతంగానూ.. సామాజికంగానూ .. ఆలోచలను సక్రమంగా ఉంచే కాలమని పండితులు చెబుతున్నారు. మార్చి19న ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరంలో ప్రతి విషయంలో  క్లారిటి ఉండే అవకాశంఉంది. ఇంకా విద్యారంగంలో పెనుమార్పులకు అవకాశం.. సమాజ సేవ.. ఐకమత్యత  మొదలగు విషయాల్లో గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక అభివృద్దిపై దృష్టి పెట్టాలని పండితులు అంటున్నారు.  

►ALSO READ | ఉగాది రెసిపీలు : ఘుమఘుమలాడే మామిడి పులిహోర, సగ్గు బియ్యం దద్దోజనం తయారీ విధానం ఇలా..!

ఉగాది సందేశం

ఏ పండుగ అయినా.. వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు కూడా ముఖ్యం.  ప్రతి రోజు సమాజ సేవ చేయడానికి ఎవరికి అవకాశం ఉండదు.  అందువలన కొత్త సంవత్సరం రోజు అంటే 2026 మార్చి 19న  అవసరమైన వారికి సాయం చేయాలి.   ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సేవా సంకల్పంతో ముందడుగు వేసి..  విద్య, వైద్యం, పునరావాస సేవలకు మన వంతు సహకారం అందించి. .వికలాంగులకు..అనాథ పిల్లలకు.. పేదవారికి చేయూత నిచ్చి . వెలుగు అనే ఆశను నింపుదాం. . .. అసలైన పుణ్యకార్యంలో భాగస్వాములయి.. . సమాజానికి మనవంతు సేవ చేద్దాం. . 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.