Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 28న 19వ సీజన్ గ్రాండ్‌గా షురూ కాబోతుంది. ఈ క్రమంలో మరోసారి అందరి చూపు యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపైనే పడింది. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసి విధ్వంసం సృష్టించిన ఇతడిపై ఈసారి భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో వైభవ్ గురించి శాంసన్ ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మార్చి 15న బీసీసీఐ ఢిల్లీ వేదికగా నమన్ అవార్డులను ప్రధానం చేసింది. ఈ ఈవెంట్లో ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన మెన్స్, ఉమెన్స్ జట్లను సన్మానించారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అతడు తన సీనియర్లు హార్దిక్ పాండ్య, అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌తో కలిసి క్వశ్చన్ సెషన్లో కూర్చున్నాడు. అందులో వైభవ్‌కు హోస్ట్ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతి ఎక్కడికి వెళ్లింది అని అడగ్గా, 'లక్నో సూపర్ జెయింట్స్‌పై డెబ్యూ మ్యాచ్ ఆడాను.. ఆ మ్యాచ్‌లో నేను ఎదుర్కొన్న తొలి బాల్ ని కవర్స్ మీదుగా సిక్స్ కొట్టాను అని వైభవ్ సమాధానం ఇచ్చాడు.
అయితే మీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇక్కడే ఉన్నాడు.. అతను టెస్టుల్లో ఓపిగ్గా ఆడుతూ రెండు రోజులు బ్యాటింగ్ చేస్తాడు.. అలాంటిది నువ్వు ఫస్ట్ బంతినే సిక్స్ కొడతానని చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడని? హోస్ట్ అడిగాడు. దీనికి వైభవ్ ఆన్సర్ ఇస్తుండగానే, అక్కడే ఉన్న సంజు శాంసన్ మధ్యలో కల్పించుకొని.. లక్నోతో మ్యాచ్ కి ముందు రోజు ద్రవిడ్ సర్ నన్ను, వైభవ్‌ను రూంకి పిలిచారు.. 'వైభవ్ చాలా చిన్నపిల్లవాడు.. ఎలా ఆడాలి? ఎలా ముందుకెళ్లాలో మనం అతడికి చెప్పాలని రాహుల్ సర్ పేర్కొన్నారు. వెంటనే 'వైభవ్ నీ గేమ్ ప్లాన్ ఏంటి? అని కోచ్ సర్ అతడిని అడిగాడు. దీనికి అతడు 'ప్లాన్ అంటూ ఏమీ లేదు సర్, ఛాన్స్ ఇస్తే తొలి బంతినే గాల్లోకి లేపేయడమే' అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అతడు వీడియో గేమ్ ఆడుతున్నాడా? ఏంటి అని నేను అప్పుడే అనుకున్నానని శాంసన్ నవ్వుతూ వైభవ్ అరంగేట్రం కంటే ముందు జరిగిన చర్చను షేర్ చేసుకున్నారు. రాహుల్ సర్ కి చెప్పినట్లే వైభవ్ ఆ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడని సంజు గుర్తు చేసుకున్నాడు.
►ALSO READ | IPL Players Injury: ప్లేయర్స్ కు గాయాల బెడద.. ఐపీఎల్ జట్లకి వరుస షాక్స్
కాగా, 20225 ఐపీఎల్ లో లక్నోతో జరిగిన మ్యాచ్‌తో వైభవ్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన అతను తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టిఔరా అనిపించాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని కవర్స్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. అలా ఐపీఎల్ కెరీర్‌ను సిక్స్‌తో స్టార్ట్ చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ఒకడిగా వైభవ్ నిలిచాడు. అనంతరం గుజరాత్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం కొట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.
“Agar hume pehla mila, pehle hi uda denge!” 😄
— Star Sports (@StarSportsIndia) March 15, 2026
Samson unveils Vaibhav Sooryavanshi’s simple yet very effective strategy behind his fearless gameplay! 🙌💪
Watch BCCI Naman awards 👉https://t.co/8W5zMWhfvk pic.twitter.com/0f04IeP6S2
