ఉప్పల్ కానిస్టేబుల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు...

ఉప్పల్ కానిస్టేబుల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు...

హైదరాబాద్ ఉప్పల్ లో కానిస్టేబుల్ సుధీర్ రెడ్డిని స్నేహితుడే కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుధీర్ రెడ్డి హత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం మత్తులో సుధీర్ రెడ్డి, సంతోష్ ల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసినట్లు తెలిపారు పోలీసులు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన సంతోష్ సుధీర్ రెడ్డిని హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు పోలీసులు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని‌ చేస్తున్న సుధీర్ కుమార్, చిలుకానగర్ లో ఆటో‌ డ్రైవర్ సంతోష్ నాయక్ మంచి‌ స్నేహితులు రాత్రి వేళ ఇద్దరు మద్యం తాగేవారు. ఆదివారం ‌చిలుకానగర్ లో‌  ఇద్దరు కలిసి మద్యం తాగారు.‌ఇద్దరి‌ మధ్య చిన్నపాటి విషయంపై మాట మాట పెరిగింది. ‌

►ALSO READ | శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి డ్రోన్స్ కలకలం.. రూ.42 లక్షల డ్రోన్స్ పట్టివేత

అప్పటికే మత్తులో ఉన్న సుధీర్... సంతోష్ నాయక్ పై చేయి‌ చేసుకున్నాడు. దీంతో ‌ ఆవేశంతో సుధీర్ పై కత్తితో దాడి చేశాడు సంతోష్. ఈ దాడిలో తీవ్ర గాయాలవడంతో సుధీర్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుడు సంతోష్ నాయక్ తో పాటు సహకరించిన తరుణ్ ని   అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు ఉప్పల్ డీసీపీ‌ సురేష్ కుమార్.