నిజామాబాద్ పసుపుపై వార్ ఎఫెక్ట్.. పసుపు రేట్లు ఢమాల్

నిజామాబాద్ పసుపుపై వార్ ఎఫెక్ట్.. పసుపు రేట్లు ఢమాల్

 ఇరాన్ ,అమెరికా యుద్దం భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్,డీజిల్, ఎల్పీజీ గ్యాస్, సీఎన్జీ కొరత వల్ల దేశంలో ఇప్పటికే  తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఈ ప్రభావం తెలంగాణలోని  నిజామాబాద్ జిల్లా పసుపు రైతులపై కూడా పడింది. 

ఇరాన్ యుద్ధం కారణంగా పలు గల్ఫ్ దేశాలకు నిజామాబాద్ పసుపు ఎగుమతి నిలిచిపోయింది.10 రోజులుగా ఎగుమతులు  నిలిచిపోవడంతో మార్కెట్లోనే పసుపు రైతులు పడిగాపులు గాస్తున్నారు.  దీంతో పసుపు రేట్లు అమాంతం పడిపోయాయి.   యుద్దానికి ముందు క్వింటాల్ రూ.14 వేలు ఉన్న పసుపు రేటు ఇపుడు రూ. 10 వేల దిగువకు  పడిపోయింది.  యుద్ధం సాకుతో వ్యాపారులు సిండికేటై  పసుపు రేటును తగ్గించేశారు.  దీంతో  గిట్టుబాటు  ధర ఇప్పించాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మర్కెట్  యార్డుకు రోజుకు దాదాపు 20 వేల బస్తాల పసుపు వస్తుంది. పశ్చిమాసియాలో యుద్ద వాతారణం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో అమాంతం రేట్లు ఢమాల్ అయ్యాయి. 

►ALSO READ | ప్రయాణీకుల్లాగే ఆటో ఎక్కుతారు.. కానీ ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. సూర్యపేట జిల్లాలో ఏం జరిగిందంటే..

 గత 15 రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా ప్రతీకార దాడులతో దద్దరిల్లుతోంది. ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధ వాతావరణ పరిస్థితులు తగ్గేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.  ఈ పరిస్తితి ఇంకా ఇలానే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.