బీహార్‌లో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. NEET పేపర్ లీక్ నిరసనల కేసులో పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి భారతదేశంలోనే లేడు. ఏకంగా రష్యాలో ఉన్నానని అతడు వీడియో ద్వారా చెప్పడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా బహదూర్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సదాఖత్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. NEET పేపర్ లీక్ వివాదం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నిరసనలు, ఆందోళనలకు సంబంధించి స్థానిక పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సదాఖత్ పేరు కూడా ఆ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
రష్యా నుంచి బాధితుడి ఆవేదన
అయితే తనపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న సదాఖత్ రష్యా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. నేను గత నాలుగు నెలలుగా భారత్ లోనే లేను, ఏకంగా రష్యాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాను. అసలు దేశంలోనే లేని నాపై పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనుక రష్యా జెండా కనిపిస్తున్న ఆ వీడియోలో.. అధికారులు వెంటనే విచారణ జరిపి తన పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించాలని అతను రిక్వెస్ట్ చేశాడు.
►ALSO READ | ధాయ్ లాండ్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్ : చౌక అయిన ప్యాకేజీ అని వెళితే.. !
ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు కిషన్‌గంజ్ ఎస్పీ హరి మోహన్ శుక్లాను సంప్రదించగా.. నిరసనలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేదా సమస్యలు ఉన్నవారు నేరుగా తమను సంప్రదించి పరిశీలన కోరవచ్చని తెలిపారు.
పెద్ద ఎత్తున జరిగిన నిరసనల సమయంలో పోలీసులు రద్దీగా నమోదు చేసిన కేసుల్లో సరైన వెరిఫికేషన్ లేకుండానే పేర్లు చేర్చారనే విమర్శలకు ఈ ఘటన అద్దం పడుతోంది. అయితే నీట్ నిరసనల సమయంలో నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని బీహార్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ విచిత్ర ఘటన మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
If Mohammad Sadaqat has been living in Russia for the past four months, then the circumstances under which a case was registered against him deserve a fair and transparent investigation.
— Against hate 🇮🇳 (@thedeshbhakti) July 29, 2026
If any citizen has been subjected to discrimination based on their identity or religion, the… pic.twitter.com/zUy8jhdzKk
