కామారెడ్డి: పిల్లలను ప్రభుత్వ స్కూల్కు పంపాలన్న ప్రజాప్రతినిధుల బైండోవర్...కలెక్టర్ కు సర్పంచ్ ఫిర్యాదు

కామారెడ్డి: పిల్లలను ప్రభుత్వ స్కూల్కు పంపాలన్న ప్రజాప్రతినిధుల బైండోవర్...కలెక్టర్ కు సర్పంచ్ ఫిర్యాదు

కామారెడ్డి, వెలుగు: పిల్లలను ప్రభుత్వ స్కూల్​కు పంపించాలని చెప్పినందున తమను పోలీసులు తహసీల్దార్​ముందు బైండోవర్​చేశారని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్​సర్పంచ్​ మైలారం రవీందర్​రెడ్డి కలెక్టర్​కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చే ప్రైవేట్​స్కూల్ బస్సులను సర్పంచ్​రవీందర్​రెడ్డి, ఉప సర్పంచ్​మహేందర్​ఆపేస్తున్నారని కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.  

దీంతో సర్పంచ్, ఉప సర్పంచ్​ను తాడ్వాయి పోలీసులు ఇటీవల తహసీల్దార్​ఎదుట బైండోవర్​చేశారు. ప్రభుత్వ స్కూల్​కు పిల్లలను పంపాలని తాము కోరామని, ప్రభుత్వ బడి బాగు గురించి తాము కృషి చేస్తే తమను బైండోవర్ చేశారని ఫిర్యాదు చేశారు.