Team India Assistant Coach: భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా రెండేళ్ల పాటు సేవలందించిన నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ ర్యాన్ టెన్ డోస్చేట్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. జూలై 2024లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి టీమిండియా కోచింగ్ స్టాప్ లోకి వచ్చిన ర్యాన్ టెన్ కు ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనే చివరిది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఆయన తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకోలేదు. రాబోయే శ్రీలంక పర్యటనకు అతడు జట్టుతో వెళ్లడం లేదు.. కాగా ఐపీఎల్ 2026 సమయానికి ఆయన మళ్లీ కేకేఆర్ (KKR) అసిస్టెంట్ కోచ్‌గా చేరనున్నారు. దీంతో భారత అసిస్టెంట్ కోచ్ పదవి ఖాళీ అవ్వడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు పేర్లని పరిశీలిస్తుంది.
* విజయ్ దహియా:
గౌతమ్ గంభీర్ కోచింగ్ టీమ్‌లోకి వచ్చే అవకాశాల్లో భారత మాజీ ఆటగాడు, కోచ్ విజయ్ దహియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గంభీర్‌తో ఆయనకు పాత అనుబంధం ఉంది. ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు గంభీర్ మెంటార్‌గా ఉన్నప్పుడు విజయ్ దహియా అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో లక్నో వరుసగా రెండేళ్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఒకవేళ విజయ్ దహియా భారత అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైతే, అది పూర్తిగా గౌతమ్ గంభీర్ చొరవతోనే జరుగుతుందని చెప్పొచ్చు.
* హృషీకేష్ కనిత్కర్:
బీసీసీఐ సొంతంగా ఒక పేరును సిఫార్సు చేయాలనుకుంటే హృషీకేష్ కనిత్కర్ అగ్రస్థానంలో ఉంటారు. ప్రస్తుతం భారత అండర్-19 జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న కనిత్కర్, ఇటీవల ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌కు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించారు. భారత్ మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవంతో పాటు వివిధ సిరీస్‌లలో భారత సపోర్ట్ స్టాఫ్‌లో భాగమైన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. కాబట్టి గంభీర్ కోచింగ్ సెటప్‌లోకి కనిత్కర్‌ను తీసుకురావడం బోర్డుకు కూడా అనుకూలమైన నిర్ణయం అవుతుంది.
ALSO READ : లక్నోకు షాకిచ్చిన జస్టిన్ లాంగర్.. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ వైపు అడుగులు!
* వసీం జాఫర్:
ఎవరూ ఊహించని రేసులో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న జాఫర్ ప్రస్తుతం హైదరాబాద్ జట్టు మెంటార్‌గా సేవలందిస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా, ఒడిశా హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. క్రికెట్ టెక్నిక్స్‌పై ఆయనకున్న పట్టు, ఆటగాళ్లతో సులభంగా కలిసిపోయే తత్వం భారత యంగ్ బ్యాటర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి.
