Justin Langer: యాషెస్ సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాల తర్వాత ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కఠిన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్ట్ కోచ్ గా తప్పించింది. గత రెండేళ్లుగా ఇంగ్లాండ్ టెస్టు జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోవడం, మెకల్లమ్ తీసుకొచ్చిన బజ్‌బాల్ (Bazball) వ్యూహం విఫలం కావడమే దీనికి ప్రధాన కారణం. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో 3 టెస్టుల సిరీస్ ఉండటంతో కొత్త కోచ్ కోసం ఈసీబీ వేట స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ను మొదటి ఛాయిస్‌గా ఇంగ్లాండ్ పరిశీలిస్తోంది.
ఐపీఎల్ వదులుకునేందుకు లాంగర్ సిద్ధం:
ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) హెడ్ కోచ్‌గా కొనసాగుతున్న 55 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన లాంగర్, ఈసీబీ నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక పిలుపు రాలేదని, ఒకవేళ ఆఫర్ వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తానని తెలిపారు. ఈసీబీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన ఐపీఎల్‌లోని లక్నో కోచ్ పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు.
సంక్షోభంలో ఉన్న జట్టును గట్టెక్కించేందుకేనా:
ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు మైదానంలో వరుస ఓటములతో పాటు బయట ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యంతో తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గాడిలో పెట్టగల సమర్థుడిగా జస్టిన్ లాంగర్‌కు మంచి పేరుంది. శాండ్‌పేపర్ గేమ్ వివాదంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం పడి, ఆస్ట్రేలియా క్రికెట్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లాంగర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆసీస్ క్రికెట్ సంస్కృతిని పునర్నిర్మించి, 2019లో యాషెస్ ట్రోఫీని నిలబెట్టుకునేలా చేశాడు. అదే తరహా మ్యాజిక్‌ను ఇంగ్లాండ్ విషయంలోనూ రిపీట్ చేస్తాడని ఈసీబీ భావిస్తోంది.
ఐపీఎల్‌లో ఘోర రికార్డ్.. లాంగర్‌కు ఇది మైనస్:
* అయితే జస్టిన్ లాంగర్ ఇటీవలి కోచింగ్ రికార్డు ఈసీబీని కాస్త ఆలోచనలో పడేస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) హెడ్ కోచ్‌గా చేరినప్పటి నుంచి గడిచిన 3 ఐపీఎల్ సీజన్లలో ఆయన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
* 2024 & 2025 సీజన్లు: లక్నో జట్టు వరుసగా ఏడో స్థానానికే పరిమితమై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
* ఐపీఎల్ 2026 సీజన్: ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ 2026లో లక్నో పాయింట్ల పట్టికలో ఏకంగా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది.
