టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతోంది ఈ జంట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సమంత తన ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ గా ముంబైలో సమంత కనిపించిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. బ్లాక్ జంప్‌సూట్‌పై స్టైలిష్ లేస్ కేప్ ధరించిన మెరిసిపోయింది. తన బేబీ బంప్‌ను గర్వంగా ప్రదర్శిస్తూ కెమెరాలకు చిరునవ్వులు చిందించింది. ఆమె ముఖంలో కనిపించిన 'మదర్‌హుడ్ గ్లో' అభిమానులను ఫిదా చేసింది.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ప్రేమాభిమానాలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మీకు ఆరోగ్యకరమైన గర్భధారణ జరగాలి.. తల్లి, బిడ్డ ఇద్దరూ సంతోషంగా ఉండాలి' అంటూ పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'సామ్.. నీ ముఖంలో కనిపిస్తున్న గ్లో అద్భుతంగా ఉంది', 'నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు.. ఇదే చిరునవ్వు ఎప్పుడూ ఉండాలి' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
జూన్‌లో విడుదలైన 'మా ఇంటి బంగారం' సినిమా విజయోత్సవ వేడుకల్లో తొలిసారి సమంత బేబీ బంప్‌తో కనిపించింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. త్వరలోనే మెటర్నిటీ లీవ్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సామ్ జీవితంలో ఇప్పుడు సంతోషకరమైన కొత్త ప్రయాణం మొదలవుతుండటంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత బేబీ బంప్ ఫొటోలు, వీడియోలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్టార్ జంట తమ బిడ్డ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
ALSO READ : 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మేనియా.. రూ.3,700 టికెట్‌కైనా వెనక్కి తగ్గని ఫ్యాన్స్!
