Sharwanand: 800 మంది ఆర్టిస్టులతో 'భోగి' క్లైమాక్స్ షూట్.. శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ట్రీట్!

Sharwanand: 800 మంది ఆర్టిస్టులతో 'భోగి' క్లైమాక్స్ షూట్.. శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ట్రీట్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ , మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'భోగి'. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీతో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లైమాక్స్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. 

 ఏకంగా 22 రోజుల పాటు సాగిన ఈ  క్లైమాక్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ దాదాపు మూడు నెలలపాటు ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పూర్తి చేసింది.  ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన అద్భుతమైన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు..ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలను తలపించేలా ఉండేలా నిర్మాత కేకే రాధామోహన్ ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  

 

ఈ మెగా యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు.  యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ సీక్వెన్స్‌లో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.  ముఖ్యంగా శర్వానంద్ ఈ సినిమా కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆయన చేసే పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కెరీర్‌లోనే శర్వానంద్‌ను ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

►ALSO READ | Pallaburusu Teaser Out: తండ్రి-కొడుకుల ఎమోషన్‌కు కామెడీ టచ్.. 'పల్లబురుసు' టీజర్‌ రిలీజ్..

1960ల ప్రారంభ కాలం నేపథ్యంగా.. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామంలో సాగే ఈ కథలో గ్రామీణ జీవితం, భావోద్వేగాలు, ప్రతీకారం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉండనున్నాయి. హీరోయిన్‌లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

 ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తవడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 28న తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్, భావోద్వేగాలు, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో 'భోగి' ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈసారైనా శర్వానంద్  సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.