ఆర్వోబీ, ఆర్‌‌‌‌యూబీ మంజూరు చేయండి : నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌‌‌

ఆర్వోబీ, ఆర్‌‌‌‌యూబీ మంజూరు చేయండి : నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌‌‌
  • రైల్వే మంత్రిని కోరిన ఎంపీ అర్వింద్‌‌‌‌

నిజామాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర ‌‌రైల్వే శాఖ మంత్రి ‌‌అశ్విని వైష్ణవ్‌‌‌‌ను ఎంపీ  ధర్మపురి అర్వింద్‌‌ కోరారు. మంగళవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. 

నవీపేట రైల్వే క్రాసింగ్‌‌‌‌ దగ్గర ఆర్వోబీ, డిచ్‌‌‌‌పల్లి క్రాసింగ్‌‌ వద్ద ఆర్‌‌‌‌యూబీ మంజూరు చేయాలని కోరారు. ఈ రెండింటిలో ప్రజలుకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. ఇందల్వాయి, జాన్కంపేట వద్ద కొత్తగా ఆర్వోబీలు శాంక్షన్‌‌ ‌‌చేసిందుకు కృతజ్ఞతలు తెలిపారు.