బాదుడు అంటే ఇదీ :365 రోజుల్లో..70 వేల కోట్ల రూపాయల టోల్ ఛార్జీలు వసూలు

బాదుడు అంటే ఇదీ :365 రోజుల్లో..70 వేల కోట్ల రూపాయల టోల్ ఛార్జీలు వసూలు

బాదుడు అంటే ఇది.. ఏటా టోల్ ఛార్జీలు మోత మోగిపోతోంది.. ఈసారి కూడా సర్కార్  ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది. వార్షిక పాస్ లతో ముందస్తు వసూళ్లతో ఈ ఏడాది 70 వేలకోట్ల టోల్ ఛార్జీలు వసూలయ్యాయంటే ఏ రేంజ్ టోల్ ఛార్జీలు వసూలు అవుతున్నాయో గణాంకాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయలు టోల్ ఛార్జీలు వసూలు అవుతున్న  రహదారుల నిర్వహణ అంతంత మాత్రమేనని వాహనదారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎంతెంత వసూలు అయిందో  వివరాలు తెలుసుకుందాం.. 

దేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ వసూళ్లు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టోల్ ఆదాయం రూ.70వేల278కోట్లకు చేరింది. ప్రైవేట్ వాహనాల కోసం తీసుకొచ్చిన వార్షిక పాస్ పథకం ద్వారా వచ్చిన రూ.1,795.18 కోట్ల ఆదాయం లభించింది.  గత ఏడాది టోల్ వసూళ్లు రూ.61వేల408 కోట్లు ఉండగా ఈసారి గణనీయంగా పెరిగాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ అత్యధిక టోల్ ఆదాయం సాధించింది. ఆ రాష్ట్రంలో రూ.8వేల862 కోట్ల టోల్ వసూలైంది. దీంతో దేశంలోనే టోల్ ఆదాయంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

►ALSO READ | నేను 4 నెలలుగా రష్యాలో ఉన్నా..నీట్ నిరసనలో నాపై కేసు పెట్టారు .. యువకుడి వైరల్ వీడియో!

రాజస్థాన్ రూ.7వేల317 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర రూ.7వేల053 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ రూ.6వేల352 కోట్లు, కర్ణాటక రూ.4వేల779కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

యూపీలో ప్రస్తుతం141 టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి. టోల్ ప్లాజాల సంఖ్యలో 172 ప్లాజాలతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 105, మధ్యప్రదేశ్‌లో 98, కర్ణాటకలో 68 టోల్ ప్లాజాలు ఉన్నాయి.

దేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల విస్తరణ, వాహనాల సంఖ్య పెరగడం వల్ల టోల్ వసూళ్లు కూడా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఆదాయం కీలకమని  తెలిపింది.