బోధన్, వెలుగు : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి సోమవారం బోధన్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగింది. గ్రామానికి చెందిన పలువురు మహిళలతో కలిసి ఆందోళన చేపట్టింది. జల్లపల్లి సర్పంచ్ దస్తగిరి, తాను ఆరేండ్లుగా ప్రేమించుకున్నామని, తనకు రెండు సార్లు అబార్షన్ సైతం చేయించాడని ఆరోపించింది. ఇప్పుడు పెండ్లి చేసుకుందామని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు అతడితో పెండ్లి జరిపించాలని డిమాండ్ చేసింది. అనంతరం ఆర్డీవో ఆఫీస్ ఏవో సాయిలుకు వినతిపత్రం అందజేశారు.
