E20 పెట్రోల్ వాడకంపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.E20 పెట్రోల్ వాడితో కార్లు, బైకులు ఎటువంటి నష్టం ఉండదన్నారు పెట్రోలియం శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. BSIII వాహనాల్లో వాహనాల్లో కొన్ని భాగాలు మార్చితే సరిపోతుందన్నారు. ఇది సర్వీసింగ్ సమయంలో చేయాల్సిన చిన్న పనే అని అన్నారు. పెట్రోల్ సరఫరా కంపెనీలు జరిపిన స్టడీలో E20 పెట్రోల్ తో నడిచే కార్లు, బైకుల ఇంజన్లలో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని తేలిందన్నారు. E20పెట్రోల్ పై ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు గడ్కరీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాజ్యసభలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, E20 పెట్రోల్ వాడితే 2016కు ముందు తయారైన BS-III వాహనాల్లో మాత్రమే కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లను మార్చాల్సి రావచ్చని తెలిపారు. ఈ మార్పులు కూడా సాధారణ సర్వీసింగ్ సమయంలోనే చేయవచ్చని చెప్పారు.
ఇండియన్ ఆయిల్ (IOCL), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) కలిసి నిర్వహించిన స్టడీలో E20 పెట్రోల్ తో కార్లు, బైకుల ఇంజిన్లలో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని తేలిందన్నారు.
►ALSO READ | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్..
E20 పెట్రోల్ వాడకంతో పాత వాహనాల్లో పనితీరు మారలేదన్నారు. స్టార్టింగ్, డ్రైవింగ్, ఇంజిన్ మన్నిక, మెటల్ లేదా ప్లాస్టిక్ భాగాలపై ప్రభావం కనిపించలేదని కేంద్రం చెప్పారు. అయితే కొన్ని BS-III వాహనాల్లో రబ్బరు భాగాలు మాత్రమే మార్చాల్సి రావచ్చని అన్నారు.
E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందనే విమర్శలపై స్పందించిన గడ్కరీ.. వాహన మైలేజీపై కేవలం ఇంధనం మాత్రమే కాకుండా డ్రైవింగ్ విధానం, వాహనం నిర్వహణ, రోడ్ల పరిస్థితులు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయన్నారు.
E20 పెట్రోల్ అమలుకు ముందు విస్తృత స్థాయిలో ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయి పరిశోధనలు నిర్వహించామని కేంద్ర పెట్రోలియం శాఖ చెబుతోంది. వాహన తయారీ సంస్థలు కూడా E20 వాడకానికి సంబంధించిన వారంటీ క్లెయిమ్‌లను స్వీకరింస్తామని తెలిపింది.
ప్రస్తుతం E20 పెట్రోల్‌పై కొన్ని కస్టమర్ల సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, అన్ని పరీక్షలు పూర్తయ్యాకే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
