ఫోన్ పే, గూగుల్ పేలో ఇకపై మన ఫోన్ నంబర్ కనిపించదు. యూపీఐ ఐడీ, లేదా నంబర్ లోని చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించనున్నాయి. కస్టమర్ల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకొని నేషల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ ఇండియా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫోన్‌పే, గూగుల్ పే, ఇతర UPI యాప్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు త్వరలో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. డిజిటల్ పేమెంట్స్ సమయంలో కస్టమర్ల ఫోన్ నంబర్ పూర్తిగా కనిపించకుండా చేసే విధానంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పని చేస్తోంది. ఈ మార్పు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టానికి అనుగుణంగా తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం UPI లావాదేవీల్లో మొబైల్ నంబర్ ద్వారా కస్టమర్లను గుర్తిస్తున్నారు. దీంతో ఫోన్ నంబర్లు ఇతరులకు కనిపించడం వల్ల ప్రైవసీ, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది.
►ALSO READ | అమెరికాలో 7 ఏళ్లు ఉన్నారా ? H-1B వీసా ఉన్నోళ్లకు పండగే.. గ్రీన్ కార్డ్ వచ్చేసినట్లే !
ఇప్పటికే బ్యాంకులు, UPI యాప్‌లకు కస్టమర్ల మొబైల్ నంబర్లు, UPI IDలు, బ్యాంక్ ఖాతా వివరాలను దాచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మొబైల్ నంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా మార్పులు చేయాలని తెలిపింది.
అలాగే QR కోడ్ ద్వారా చెల్లింపులు పూర్తయిన తర్వాత కూడా పేయర్ లేదా మనీ రీసీవర్ ఫోన్ నంబర్ కనిపించకుండా ఉంటుంది. మొబైల్ నంబర్‌కు బదులుగా ప్రత్యేక UPI IDలను ఉపయోగించే అవకాశాన్ని కూడా కస్టమర్లకు కల్పించనున్నారు.
ఈ మార్పులతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, అనవసర కాల్స్, మోసాలు, ప్రైవసీ సమస్యలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
