గ్లోబల్ సమ్మిట్తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు: గవర్నర్ శుక్లా

గ్లోబల్ సమ్మిట్తో  రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు: గవర్నర్ శుక్లా

అభివృద్ధిలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మారుస్తామన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. సోమవారం (మార్చి 16) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగం చదివిన గవర్నర్.. తెలంగాణను రైజింగ్ 47 దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

గవర్నర్ స్పీచ్ హైలైట్స్:

 
  • భూభారతి పోర్టర్ లో వివాదాలు పరిష్కారం
  • పేదలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం
  • రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులున్నాయి.
  • కార్డుదారులందరికీ సన్నబియ్యం
  • సన్నబియ్యంతో 3.38 కోట్ల మందికి లబ్ది
  • ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం
  • రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది
  • ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ 5 లక్షల సాయం అందిస్తున్నాం
  • రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది
  • రైతు భరోసా కింద 9 రోజుల్లో 9 వేల కోట్లు అందించాం
  • సన్నవడ్లు పండిస్తున్న రైతులకు 500 రూపాయల బోనస్
  • భూభారతి పోర్టల్ తో భూ వివాదాల పరిష్కారం
  • భూ భారతితో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది
  • మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ జర్నీ
  • ఫ్రీ బస్ కింద రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం
  • మహిళలకు 9,222 కోట్లు ఆదా
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నాం
  • పేదలకు 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ అందిస్తున్నాం
  • ఫ్రీ కరెంట్ తో రూ. 3900 కోట్లు ఖర్చు చేశాం
  • 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కడుతున్నాం
  • మహిళా సంఘాల ద్వారా 494 బస్సులను నడుపుతున్నాం
  • స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల వరకు రుణాలు
  • మహిళల కోసం 34 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేశాం
  • మూసీ పునరుజ్జీవంలో భాగంగా మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి
  • మొదటి దశలో మొత్తం 55 కి.మీ. మేర మూసీ పునరుజ్జీవం 
  • మూసీలోకి మురుగు నీరు చేరకుండా 39 ఎస్టీపీలు
  • ప్రజాపాలన మార్గదర్శకాల సూత్రాలను సభ ప్రతిబింభిస్తుంది.
  •  తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం
  • 2047 తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా పాలన సాగుతోంది
  • 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్నాం
  • జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్లుగా మార్పు
  • ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా పాలన
  •  కోర్, ప్యూర్, రేర్ గా తెలంగాణ విభజన
  • ప్రజలకు భద్రత కల్పించేలా 4 కమిషనరేట్లు ఏర్పాటు
  • ORR లా రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయబోతున్నాం
  • RRR చుట్టూ MSME పార్కులు రాబోతున్నాయి
  • హిస్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల బదలాయింపు చేస్తాం