కిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయలు: బీరువాలు, బ్యాంకు లాకర్లకు చేరుతున్న వెండి వస్తువులు

కిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయలు: బీరువాలు, బ్యాంకు లాకర్లకు చేరుతున్న వెండి వస్తువులు

వెండి.. ఒకప్పుడు ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పెళ్లిళ్లు, పేరంటాళ్లల్లో గిఫ్ట్ లు కింద వెండి వస్తువులు ఇచ్చేవాళ్లు. డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో వెండి కంచాల్లో భోజనం చేసేవాళ్లు. వెండి కంచాలు, గిన్నెలు విచ్చలవిడిగా వాడేస్తూ.. ఎక్కడ పడితే అక్కడే పడేసేవారు. ఇప్పుడు సీన్ మారింది.

వెండి బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. వెండి వస్తువులను ఇళ్లల్లో భద్రంగా దాచుకునే రోజులు వచ్చేశాయి. ఒకప్పుడు కిలో వెండి 50, 60 వేలు.. ఇప్పుడు.. అంటే 2026, జనవరి 29వ తేదీన కిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయలు. అవును.. వెండి బంగారం కంటే ఖరీదుగా మారిపోయింది. కిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయలు కావటంతో.. ఇళ్లల్లో వెండి వస్తువులు అన్నీ బీరువాల్లో.. బ్యాంకు లాకర్లలోకి చేరుతున్నాయి. భయం.. భయం.. కిలో వెండి ఉంటే లక్షాధికారి అనే స్థాయికి వెళ్లిపోయింది జనం మైండ్ సెంట్.. 

వెండి ధర రోజురోజుకు అమాంతం పెరుగుతుంది. కిలో వెండి 5 లక్షలు కావొచ్చు.. అంతకు మించి 6 లక్షల రూపాయల వరకు పెరగొచ్చనే అంచనాలతో వెండి వస్తువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు జనం. ఇళ్లల్లో దేవుడి గదిలో.. దీపారధనకు ఉపయోగించే వెండి వస్తువులను సైతం భద్రంగా దాచుకునే రోజులు వచ్చేశాయి. వెండి కుందీలు.. వెండి చెంబులు. దేవుడికి హారతి ఇచ్చే వెండి ఆభరణాలు.. ఇలాంటివి అన్నింటిని దేవుడి గది నుంచి తీసి బీరువాల్లో సర్దేస్తున్నారు జనం. వెండి వస్తువులు పోయిన తర్వాత ఇంట్లో పనోళ్లను అనుమానించి లాభం లేదు.. ముందు జాగ్రత్త అంటూ జనం ఫిక్స్ అయిపోయారు. 

అంతేనా.. గతంలో రోజువారీగా ఇళ్లల్లో వెండి కంచాల్లో భోజనం చేసే డబ్బున్న కుటుంబాలు ఎన్నో. ఇప్పుడు అలాంటి వారు.. వారి వారి వెండి ఆభరణాలు.. రోజువారీ వెండి వస్తువుల వినియోగాన్ని తగ్గించేశారు. వెండి వస్తువులను ఇంట్లో బీరువాల్లో సర్దేస్తున్నారు. బీరువాలకు తాళాలు వేస్తున్నారు. ఒకటి, రెండు బ్యాంక్ లాకర్లు ఉన్న కుటుంబాలు అయితే.. తమ విలువైన.. పెద్ద వెండి వస్తువులను బ్యాంక్ లాకర్లలో పెడుతున్నారు. 

మొత్తానికి వెండి వస్తువుల విషయం జనం మైండ్ సెట్ మారిపోయింది. బంగారాన్ని ఎంత భద్రతంగా దాచుకుంటామో.. అదే తరహాలో వెండి వస్తువులు, ఆభరణాలను ఇప్పుడు అంతే భద్రంగా దాచుకునే రోజులు వచ్చేశాయి.. వచ్చాయి.