మీరు కాల్చేయండి..నేను చూసుకుంటా.. ఫాంహౌస్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్

మీరు కాల్చేయండి..నేను చూసుకుంటా.. ఫాంహౌస్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్
  •  
  • ఆ రివాల్వర్ పైలట్ సోదరుడు రితీశ్ రెడ్డిది
  •  నమిత్ శర్మ చేతిలో తుపాకీ స్వాధీనం చేసుకున్నం
  •  ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్

హైదరాబాద్  మొయినాబాద్ ఫాం హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు 11మంది ఉన్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో పలు కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ పార్టీలో డ్రగ్స్ తో పాటు మద్యం కూడా తీసుకున్న ట్టు పోలీసులు రిమాండో రిపోర్టులో పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగింది. మేము వెళ్ళగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినబడింది.. బుల్లెట్ సౌండ్ విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యాం.. మేం పోలీసులము కాల్చవద్దు. ఎలాంటి చర్యలు తీసుకోమని మేము గట్టిగా అరిచాం. మేము చెప్తున్నప్పటికీ కూడా మరో రెండు సార్లు బుల్లెట్ సౌండ్ విని పించింది. మరోవైపు మీరు కాల్చేయండి. నేను మొత్తం చూసుకుంటాను..ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా మాటలు వినిపించాయి. మేమంతా గట్టిగా అరిచేసరికి ఒకసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయింది. మేం మూకుమ్మడిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్ హౌజ్ లోకి ఎంటర్ కాగానే వెంటనే సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చాం.

 బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకిని మేము స్వాధీనం చేసుకు న్నాం. బుల్లెట్ షెల్ప్ పట్టుకొని మరొకరు ఉన్నారు అతని కూడా అదుపులోకి తీసు కున్నాం. ఒక మహిళతో పాటు పదిమం దీని అదుపు తీసుకున్నాం.. జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32 ని స్వాధీనం పరు చుకున్నాం.. 11 మందిని విడివిడిగా పెట్టి విచారణ జరిపాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి బుకాయించే ప్ర యత్నం చేశారు. చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఒప్పుకు న్నాడు. అతనిని చెక్ చేసినప్పుడు రెండు గ్రాముల కొకైన్ బయటపడింది.. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ని విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయ టపడింది. 

సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్లిన ప్పుడు తానే కొకైన్ తెచ్చుకున్నట్టు కౌశిక్ చెప్పాడు. డ్రగ్ పార్టీ కోసమే కొకైన్ ను తీసుకువచ్చినట్లు కౌశిక్ చెప్పాడు.11 మందికి డ్రగ్ లైవ్ కిట్టు ద్వారా టెస్టులు చేశాం. అర్జున్ రెడ్డి కౌశిక్ రవి రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రోహిత్ రెడ్డి లకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది. కాల్పులు జరిపింది పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించాం. ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిగిన ట్లు సమిత శర్మ చెప్పాడు. కాల్పులు జరిపి ఫామ్ హౌజ్ నుంచి తప్పించుకొని పారి పోవాలని ప్లాన్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అర్జున్ రెడ్డిలు కొకైన్ తీ సుకున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటీవ్ వచ్చింది. సమిత శర్మ. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి. పుత్తమహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి లకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది. వీళ్లు మద్యం, కొకైన్ కలుపుకొని తాగారు.