తెలంగాణలో గడ్డి, కలుపు మందులు నిషేదించండి..: రైతు కమిషన్

 తెలంగాణలో గడ్డి, కలుపు మందులు నిషేదించండి..: రైతు కమిషన్

హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి మందులను తక్షణమే నిషేధించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేశారు. ప్రపంచవ్యాప్తం గా దాదాపు 70కి పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను నిషేధించారని తెలిపారు. కానీ మన దేశంలో ఇవి విచ్చలవిడిగా దొరుకుతు న్నాయని కమిషన్ పేర్కొంది.

 గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో వీటిని తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ మందుల నిషేధాన్ని సమర్థిస్తోందని, ప్రజారోగ్యం దృష్ట్యా వీటిని అరికట్టాలని నివేదికలో వివరించారు. తెలంగాణలో ఈ మందులను నిషేధించడంతో పాటు, దేశవ్యాప్తంగా వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ముఖ్యమం త్రిని కోరాడు. రైతు కమిషన్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతక మైన ఈ విష రసాయనాలను రాష్ట్రంలో నిషే ధించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.