BSC పూర్తయితే వెంటనే అప్లై చేసుకోండి.. రూ.40 వేల జీతంతో BARCలో పోస్టులు

BSC  పూర్తయితే వెంటనే అప్లై చేసుకోండి.. రూ.40 వేల జీతంతో BARCలో  పోస్టులు

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 31.

ఖాళీలు: 105 (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్). 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్సెస్‌లో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ బీఎస్-ఎంఎస్ (డ్యూయల్ డిగ్రీ) / బీఎస్సీ (నాలుగో సంవత్సరం పరిశోధనతో)  పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 10. 
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరికీ రూ.500. 
లాస్ట్ డేట్: మార్చి 31.
ఇంటర్వ్యూ: 2026, జూన్ – జులై. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్www.barc.gov.inను సంప్రదించండి.