- 30న ఎదుర్కోలు, 31న తిరుకల్యాణం, ఫిబ్రవరి 1న రథోత్సవం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, రక్షాబంధనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనంతో ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల అర్చకత్వంలో అర్చకులు వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
30న స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 31న తిరుకల్యాణ మహోత్సవం, ఫిబ్రవరి 1న దివ్యవిమాన రథోత్సవం జరగనున్నాయి. కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వినోద్ రెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
