Weekend OTT Releases: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్స్.. జనవరి 30న స్ట్రీమింగ్ కానున్న టాప్ చిత్రాలు ఇవే!

Weekend OTT Releases: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్స్.. జనవరి 30న స్ట్రీమింగ్ కానున్న టాప్ చిత్రాలు ఇవే!

వారాంతం వచ్చేసింది.  హాయిగా ఇంట్లోనే సోఫాలో కూర్చుని కుటుంబంతో కలిసి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేందుకు రెడీ ఉన్నారా.. అయితే మీ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ భారీ చిత్రాలతో సిద్ధమయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్, హారర్, కామెడీ మూవీస్ తో  ఈ శుక్రవారం జనవరి 30, 2026న స్టీమింగ్ కు రెడీ అయ్యాయి. వాటిల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ నుంచి, నివిన్ పౌలీ నవ్వులు పూయించే హారర్-కామెడీ వరకు క్యూ కట్టాయి. ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన టాప్ ఓటీటీ రిలీజ్ చిత్రాలు  ఏమిటో చూద్దాం... 

'ధురంధర్' (Dhurandhar) 

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేయనుంది. పాకిస్థాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్, ఐఎస్ఐ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఒక టాప్ రా (RAW) ఏజెంట్ (రణవీర్ సింగ్) చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా.  ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్‌గా ఆర్. మాధవన్ నటించగా, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో మెరిశారు. దేశభక్తి, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. జనవరి 30 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంటుంది.

 

 దల్దల్ (Daldal) 

బహుముఖ ప్రజ్ఞాశాలి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'దల్దల్'. విష్ ధమీజా రాసిన 'భిండీ బజార్' నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ముంబైలో జరిగే వరుస దారుణ హత్యలను దర్యాప్తు చేసే డిసిపి రీటా ఫెరీరా (భూమి) ప్రయాణమే ఈ కథ. తన వ్యక్తిగత గాయాలు, వ్యవస్థలోని అవినీతితో పోరాడుతూ హంతకుడిని ఎలా పట్టుకుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. జనవరి 30 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో  స్ట్రీమింగ్ కానుంది.

 

సర్వం మాయ (Sarvam Maya)

మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన హారర్-కామెడీ చిత్రం 'సర్వం మాయ' ( Sarvam Maya ). బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. నాస్తికుడైన ఒక గిటారిస్ట్ (నివిన్ పౌలీ) తన పూర్వీకుల పురోహిత వృత్తిలోకి మారాల్సి వస్తుంది. ఆ సమయంలో 'డెలూలు' అనే పేరు గల ఒక జెన్-జీ (Gen Z) దెయ్యంతో అతనికి ఎదురైన వింత అనుభవాలు, కామెడీ ఈ సినిమా ప్రత్యేకత. ఇది జనవరి 30 నుండి జియో హాట్‌స్టార్ (JioHotstar) లో అందుబాటులోకి రానుంది.

►ALSO READ | Sankranthi Movie OTT: ఓటీటీలోకి వస్తోన్న తొలి సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ & ప్లాట్‌ఫామ్ ఇదే!

 

 దేవ్‌ఖేల్ (Devkhel) 

మరాఠీ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన సైకలాజికల్ థ్రిల్లర్ 'దేవ్‌ఖేల్'. అంకుష్ చౌదరి కీలక పాత్రలో నటించారు. కొంకణ్‌ తీరంలోని దేవ్‌తాలి అనే గ్రామంలో ప్రతి హోలీ పౌర్ణమికి ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తుంటారు. దానికి కారణం శంకసురుడు అనే రాక్షసుడని ప్రజల నమ్మకం. కానీ, ఇన్స్‌పెక్టర్ విశ్వాస్ ఈ మూఢనమ్మకాన్ని చేధిస్తూ అసలు నిజాన్ని ఎలా బయటపెట్టాడనేదే కథ. ఈ వెబ్ సిరీస్ జనవరి 30 నుండి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది.