హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై కారులో మంటలు.. చూస్తుండగానే బూడిదైంది

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై కారులో మంటలు.. చూస్తుండగానే బూడిదైంది

ఔటర్ రింగు రోడ్డుపై సడెన్ గా కారులో మంటలు రావటం కలకలం రేపింది.  మంగళవారం (జనవరి 27) సాయంత్రం హైదరాబాద్ నార్సింగి పరిధిలో జరిగింది ఈ ఘటన. తెలంగాణ పోలీస్ అకాడెమీ సమీపంలో ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలరేగాయి. 

తుక్కుగూడ నుంచి నార్సింగి వైపు వస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ వెంటనే కారునుంచి దిగి తప్పించుకున్నాడు. తృటిలో ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఫైర్ యాక్సిడెంట్ తో కాసేపు ట్రాఫిక్ జాం అయ్యింది. 

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజిన్ తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారు సగ భాగం కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.