Tharun Bhascker : త్వరలోనే 'గుడ్ న్యూస్' చెబుతా.. ఈషా రెబ్బాతో రిలేషన్‌పై తరుణ్ భాస్కర్ ఓపెన్!

Tharun Bhascker : త్వరలోనే 'గుడ్ న్యూస్' చెబుతా.. ఈషా రెబ్బాతో రిలేషన్‌పై తరుణ్ భాస్కర్ ఓపెన్!

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ఒక జంట పేరు తెగ మార్మోగుతోంది. అది మరేవరో కాదు.. టాలెంటెడ్ డెరెక్టర్ కమ్  యాక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. వీరిద్దరూ..  ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ స్పందించిన తీరు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే!

తాము నటించిన తాజా చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' ప్రమోషన్స్‌లో ఈషా రెబ్బాకు డేటింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె చాలా చాకచక్యంగా సమాధానమిచ్చింది ఈ బ్యూటీ. "ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే కదా! ప్రస్తుతానికి దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఒకవేళ నా జీవితంలో ఏదైనా విశేషం ఉంటే నేనే స్వయంగా అందరికీ చెబుతాను" అని పేర్కొన్నారు. ఈ ముద్దుగుమ్మ ఈ ప్రేమ ముచ్చటను మాత్రం ఖండించకుండా సమాధానం దాటమేసింది..

తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?

ఈషా కంటే ఒక అడుగు ముందుకు వేసిన తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పారు. "ఆమె నాకు ఒక స్నేహితురాలి కంటే ఎక్కువ " అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది నా వ్యక్తిగత విషయం. ఏదైనా చెప్పేటప్పుడు అది ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని నేను భావిస్తాను. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మీ అందరికీ ఒక 'గుడ్ న్యూస్' చెబుతాను  అని హింట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' కాదు, సీరియస్ రిలేషనే ఉందని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.

జంటగా థియేటర్లలో సందడి.

వీరిద్దరూ జంటగా నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' చిత్రం మలయాళ హిట్ మూవీ 'జయజయజయ జయహే' కి రీమేక్‌గా వస్తోంది. ఎ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది. తెరపై వీరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తరుణ్ భాస్కర్ చెప్పిన ఆ 'గుడ్ న్యూస్' పెళ్లి గురించేనా? లేక మరో కొత్త ప్రాజెక్ట్ గురించా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!