మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్చారం మండలం రాంపూర్ దగ్గర నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మార్చి 14న నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీటీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు తండ్రీ కొడుకులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరు వైపులా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి మృతులు హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లికి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిశివర్ధన్ గౌడ్ (13), బొగడ భూపతి పూర్ కు చెందిన సాయ గౌడ్ (32) గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
