టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి . ఆకు పచ్చ కోకలో సంప్రదాయంగా మెరిసిన శ్రీలీల.. బంగారు ఆభరణాలతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన రామ్ పరివార్ చైన్ ఉన్న ఫొటో నెటిజన్ల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. అభిమానులు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ పెద్ద సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆశలన్నీ ఉస్తాద్ పైనే..
ఇటీవల ఆమె నటించిన 'పరాశక్తి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో శ్రీలీల తన ఆశలన్నీ శ్రీలీల తదుపరి చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఆర్ పార్టిబన్, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొలిరోజే భారత్ లో సుమారు రూ.40 కోట్ల నెట్ వసూళ్లు సాదించే అవకాశముందని చెబుతున్నారు.
►ALSO READ | Allu Sirish : నగలు వేసుకుంటే తప్పేంటి? ట్రోలర్లలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అల్లు శిరీష్!
కెరీర్ లో బెస్ట్ ఇదేనా?
అలా జరిగితే శ్రీలీల కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె కెరీర్ లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ చిత్రం 2024లో తొలి రోజే రూ. 41.3 కోట్లు వసూలు చేసింది. అలాగే 'భగవంత్ కేసరి రూ.16.6 కోట్లు 'పరాశక్తి' రూ. 12.5 కోట్లు, ధమాకా' రూ.6.7 కోట్లు తొలిరోజు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫలితం ఎలా ఉంటుందోనని సినీ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
