మద్యం అమ్మితే కరెంట్ కట్, రేషన్ కార్డులు రద్దు.. జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా  సర్పంచ్  నిర్ణయం

మద్యం అమ్మితే కరెంట్ కట్, రేషన్ కార్డులు రద్దు.. జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా  సర్పంచ్  నిర్ణయం

జనగామ జిల్లాలోఓ  సర్పంచ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. చిల్పూర్ మండలం నష్కల్ గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపుల నిర్మూలనకు సర్పంచ్ శాతబోయిన రాజు సరికొత్త  నిర్ణయం  ప్రయోగించారు. గ్రామంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా ఆ షాపులు నిర్వహిస్తున్న ఇండ్ల విద్యుత్ కనెక్షన్లను తొలగించి సంచలనం సృష్టించారు.

గ్రామ పంచాయతీ తరపున ముందే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో, అధికారులు రంగంలోకి దిగి ఆరుగురు బెల్ట్ షాపు నిర్వాహకుల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు కట్ చేశారు. గ్రామంలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉండడం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోంది. అందుకే మద్యపాన రహిత గ్రామం కోసం గ్రామసభలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. మాకు యువత భవిష్యత్తే ముఖ్యం. ఇకపైనా ఎవరైనా మద్యం విక్రయిస్తే రేషన్ కార్డు, కరెంటుతో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను కూడా నిలిపేస్తాం. ఇకపై మద్యం అమ్మబోమని బాండ్ పేపర్ రాసిస్తేనే... కరెంట్ కనెక్షన్లను పునరుద్ధరిస్తాం అని తేల్చి చెప్పారు సర్పంచ్

మద్యం మహమ్మారి బారి నుంచి గ్రామాన్ని, యువతను కాపాడుకునేందుకు నష్కల్ సర్పంచ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నిర్ణయంతోనైనా నష్కల్ గ్రామం బెల్ట్ షాపుల రహిత గ్రామంగా మారుతుందో లేదో చూడాలి.