Awarapan 2 Teaser: 19 ఏళ్ల తర్వాత వస్తున్న కల్ట్ క్లాసిక్‌ సీక్వెల్.. ట్రెండింగ్లో ‘అవరాపన్ 2’ టీజర్

Awarapan 2 Teaser: 19 ఏళ్ల తర్వాత వస్తున్న కల్ట్ క్లాసిక్‌ సీక్వెల్.. ట్రెండింగ్లో ‘అవరాపన్ 2’ టీజర్

బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అవరాపన్ 2’. 2007లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందిన అవరాపన్ (Awarapan) చిత్రానికి ఇది సీక్వెల్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి శివమ్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ‘అవరాపన్ 2’ టీజర్‌ రిలీజై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినీ లవర్స్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎలా ఉందొ లుక్కేద్దాం.  

దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీ తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తోండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇమ్రాన్ హష్మీ మరోసారి శివమ్ పండిట్ పాత్రలో కనిపించనుండటం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా, దిశా పటాని, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘‘19 ఏళ్ల తర్వాత శివమ్ తిరిగి వచ్చాడు. బాధలు, నష్టాలతో వెంటాడుతున్న ఓ వ్యక్తి తన జీవితానికి అర్థం వెతుక్కుంటున్నాడు’’ అనే క్యాప్షన్‌తో మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈసారి ఈ ఆవారాపన్ ముగుస్తుందా.. లేక నేను?’ అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

టీజర్‌లో ఇమ్రాన్ హష్మీ పోషించిన శివమ్ పాత్ర బాధ, నష్టం, విముక్తి కోసం చేసే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన Toh Phir Aao రీప్రైజ్ వెర్షన్ అభిమానుల్లో పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసింది. ఈ క్రమంలోనే ‘పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయి’ అంటూ సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫస్ట్ పార్ట్ అవరాపన్ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించకపోయినా, ఏళ్లు గడిచేకొద్దీ కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ముఖ్యంగా సినిమాలో ఉన్న మ్యూజిక్, ఎమోషనల్ స్టోరీ, ఇమ్రాన్ నటన ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నాయి.

సాధారణంగా ఇమ్రాన్ హష్మీ సినిమాలకు సంగీతం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. దీంతో ‘ఆవారాపన్ 2’ ఆల్బమ్‌లో ఈసారి ఎలాంటి పాటలు ఉండబోతున్నాయో తెలుసుకోవాలని కల్ట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కాగా ఈ చిత్రం 2026 ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే స్పెషల్గా రిలీజ్ కానుంది.