హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రేపటి ( జూన్ 30) ఖమ్మం పర్యటన రద్దు అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు దగ్గర మంగళవారం (జూన్ 30) జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది.
ఈ సభలో సీఎం రేవంత్ రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఆదివారం (జూన్ 28) కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో సభా ప్రాంగణం పూర్తిగా జలమయమైంది. దీంతో చేసేదేమిలేక ప్రభుత్వం ఈ సభను రద్దు వేసింది. ఈ కార్యక్రమ వేదికను ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చింది.
మంగళవారం (జూన్ 30) హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచి సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రైతులతో మాట్లాడనున్నారు. చివరి నిమిషంలో సభ రద్దు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.
