దండకారణ్యంలో తిరంగా యాత్ర.. నారాయణపూర్ నుంచి కర్రె గుట్టల వరకు బైక్ ర్యాలీ

దండకారణ్యంలో తిరంగా యాత్ర.. నారాయణపూర్ నుంచి కర్రె గుట్టల వరకు బైక్ ర్యాలీ
  • నారాయణ్ పూర్ లో ప్రారంభించిన ఛత్తీస్ గఢ్ ..
  • డిప్యూటీ సీఎంహోం మినిస్టర్ విజయ్ శర్మ
  • 15వ తేదీ నాటికి కర్రెగుట్టలు చేరుకోనున్న యాత్ర

భద్రాచలం, వెలుగు : బస్తర్ ​దండకారణ్యంలోని మావోయిస్టుల కంచుకోట నారాయణ్​పూర్ నుంచి కర్రెగుట్టల వరకు తిరంగా యాత్ర చేపట్టారు.  ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్​శర్మ, అటవీశాఖ మంత్రి కేదార్​కశ్యప్​కలిసి బుధవారం నారాయణ్ పూర్ లో బైక్ ర్యాలీని ప్రారంభించారు. 
మొదటి రోజు నారాయణ్​పూర్​ నుంచి దౌడాయి, కన్హార్​గావ్, కోడెనార్, బోదలీ, సాత్​ధార్, బార్సూర్, గీదం, దంతెవాడ వరకు యాత్ర జరిగింది. 15వ తేదీ ఉదయం నాటికి బైకర్లు కర్రె గుట్టలకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 

విద్యార్ధులు, ఎన్​సీసీ కేడెట్లు, మహిళా బైకర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మావోయిస్టుల మందుపాతర పేలుళ్లు, దాడి జరిగిన ప్రదేశంలో మట్టిని సేకరిస్తున్నారు. ఆ మట్టిని స్మృతి స్తూపంలో పొందుపరిచి భావితరాలకు వివరించేలా యాత్రను చేపట్టారు.