పెరుగుతున్న గోదావరి ఉధృతి.. భద్రాచలం వద్ద 24.90 అడుగుల మేర ప్రవహిస్తున్న నీరు

పెరుగుతున్న గోదావరి ఉధృతి.. భద్రాచలం వద్ద 24.90 అడుగుల మేర ప్రవహిస్తున్న నీరు
  • కోరెగడ్డపై చిక్కుకున్న కూలీలు, రక్షించిన స్థానిక యువకులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గంటకు ఒక అడుగు చొప్పున పెరుగుతుండగా.. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు గోదావరి నీటిమట్టం 24.90 అడుగులకు చేరుకుంది.

భద్రాచలానికి ఎగువన ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత ఉపనదుల నుంచి వస్తున్న నీటితో సుమారు 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది. చర్ల మండలం వీరాపురం వద్ద గోదావరి లంకల్లోని కోరెగడ్డలో వ్యవసాయ కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు.

విషయం తెలుసుకున్న స్థానిక యువకులు ఇర్పా వసంత్, ఎడారి శ్రీనివాస్​కలిసి రెండు నాటు పడవల్లో వెళ్లి 30 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వీరాపురం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. కనిపించకుండా పోయిన కూలీల కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతవాగు పొంగడంతో నారచీరలు నీట మునిగాయి.