KavyaAnirudh: కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన రాక్‌స్టార్ మేనమామ!

KavyaAnirudh: కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన రాక్‌స్టార్ మేనమామ!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రాక్ స్టార్ గా వెలిగిపోతున్న అనిరుధ్ రవిచందర్ .. ఐపీఎల్ మ్యాచ్ ల్లో తన హావభావాలతో సోషల్ మీడియాను షేక్ చేసిన 'సన్ రైజర్స్ హైదరాబాద్' బాస్ కావ్యమారన్ లవ్ లో ఉన్నారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్నాళ్లూ కేవలం రూమర్స్ కే పరిమితిమైన ఈ క్రేజీ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటల వరకు చేరినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ విషయాన్ని అనిరుధ్ సొంత కుటుంబ సభ్యుడే కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇప్పడీ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

ప్రముఖ సీనియర్ నటుడు, అనిరుధ్ మేనమామ  వై. జీ. మహేంద్రన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మెగా వెడ్డింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్ చాలా సాఫ్ట్ బాయ్. వాడు ఒక పెద్ద ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి పెళ్లి దాదాపు ఖాయమైంది అంటూ మహేంద్రన్ బాంబ్ పేల్చారు.  కావ్య మారన్ సాదాసీదా అమ్మాయి కాదు. సన్‌రైజర్స్ లాంటి పెద్ద టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తోందన్నారు. ఆమెకు తన తండ్రి కళానిధి మారన్ వ్యాపార లక్షణాలు వచ్చాయి. అనిరుధ్, కావ్య ఇద్దరూ బెస్ట్ పెయిర్ అని కొనియాడారు.. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి మ్యూజికల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాలి అంటూ ఆయన ఆకాంక్షించారు.

నిజానికి 2025లోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు, అనిరుధ్ తరపున సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్ ఇంటికి వెళ్లి పెళ్లి ప్రతిపాదన తెచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో అనిరుధ్ స్పందిస్తూ.. మ్యారేజ్ ఆ? లాఫ్ అవుట్ లౌడ్.. దయచేసి రూమర్స్ నమ్మకండి అంటూ కొట్టిపారేశారు. కానీ, డేటింగ్ వార్తలను మాత్రం ఖండించలేదు.

ప్రస్తుతం అనిరుధ్ రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ 'జన నాయగన్', షారుఖ్ ఖాన్ 'కింగ్', అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న 'రాకా' మూవీతో పాటు పలు భారీ ప్రాజెక్టులకు సంగీతం అదిస్తున్నారు. మరోవైపు కావ్య మారన్ సన్ నెట్‌వర్క్ బాధ్యతలతో పాటు ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు. పెళ్లి తేదీ, వేదికపై ఈ లవ్ బర్డ్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే తరువాయి. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే మాత్రం సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ వెడ్డింగ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.