సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో భారీగా డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు  కస్టమ్స్​ అధికారులు.సింగపూర్​ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్​ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో డ్రోన్లను  సింగపూర్​ నుంచి తీసుకురావడం వెనక కారణం ఏంటనే  కోణంలో విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

శనివారం (మార్చి 14)  శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్​ నుంచి ముగ్గురు ప్రయాణికులు తీసుకొచ్చిన 70 డ్రోన్లను కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు.  రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను సింగపూర్​ నుంచి శంషాబాద్​ కు తీసుకువచ్చారు.  పట్టుకున్న డ్రోన్ల విలువ దాదాపు రూ.50లక్షల ఉంటుందని  అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్ స్పేస్  క్లోజ్​ చేయడంతో శంషాబాద్​ ఎయిర్ పోర్టు నుంచి  ఆయా దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం మొత్తం 13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు.