- మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో..
- రెండో రోజు పాలమూరు యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు
- హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ వర్సిటీల వీసీలు
మహబూబ్‌నగర్, వెలుగు : విజన్ఇండియా 2047 అంశంతో పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్, యూత్ ఎంపవర్ మెంట్ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో సదస్సు ప్రారంభం కానుండగా, రెండో రోజైన శనివారం పాలమూరు యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో శుక్రవారం ఉదయం పది గంటలకు సదస్సు ప్రారంభించిన అనంతరం వక్తలు, ముఖ్య అతిథులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఒంటి గంట వరకు నేషనల్ఎడ్యుకేషన్పాలసీ (ఎన్ఈపీ) ఐదేండ్ల ప్రస్థానం, అభివృద్ధిపై చర్చించనున్నారు. రెండు గంటల నుంచి 3.30 గంటల వరకు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చ, 3.45 నుంచి 4.45 వరకు ఇండస్ట్రీ అకడమిక్ఇంటరాక్షన్, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు స్టార్టప్, ఇన్నోవేషన్ స్టాల్స్ పరిశీలన, 5.30 నుంచి రాత్రి 7.15 వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు.
రెండో రోజైన శనివారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు వర్సిటీలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదు సెషన్స్‌లో క్యాంపస్‌లో సదస్సు నిర్వహణ, పీఎం ఉషా కింద మంజూరైన అభివృద్ధి పనుల పరిశీలన, పోస్టర్ప్రజంటేషన్, ఎగ్జిబిషన్, ఇన్నోవేషన్ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.
సదస్సులో సదస్సులో స్టార్టప్, డిజిటల్ఇండియా, ఆత్మనిర్బర్ భారత్, స్కిల్ఇండియా, మహిళల అభివృద్ధి అనే జాతీయ కార్యక్రమాలకు అనుగుణంగా వ్యూహాత్మక విద్యా, శాస్ర్తీయ విద్యా విధానాలపై చర్చించనున్నారు.
